మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు బైఠాయించి వంటావార్పు చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవీందర్, కార్మిక సంఘం అధ్యక్షుడు బుజ్జి గారి సాయిలు, రాజు, సాయిలు, వెంకట్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.