నస్రుల్లాబాద్: అంత్యక్రియలకు సాయం అందజేసిన బీజేపీ నాయకులు

5చూసినవారు
నస్రుల్లాబాద్: అంత్యక్రియలకు సాయం అందజేసిన బీజేపీ నాయకులు
నస్రుల్లాబాద్ మండలం కాంశెట్ పల్లి గ్రామానికి చెందిన నిరుపేద అయిన టపాకాన లావణ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ రూ 5000 ఆర్థిక సాయం, తృప్తి శివప్రసాద్ అంత్యక్రియలకు అవసరమైన సామాగ్రిని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, ముసునూరి శ్రీనివాసరావు, యాదగిరి గౌడ్, అరిగి నారాయణ, గంగాధర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్