కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు అరెస్టుకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. అంతే కాకుండా సోమవారం సీనియర్ జర్నలిస్టు కోమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.