బాన్సువాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేరు పదవీ కాలం ముగియడంతో నసురుల్లాబాద్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల నాయకుడు నర్సింలు గౌడ్, వెంకట్, టేకుల సాయిలు, డీ సాయిలు, రమేష్, మైలారం ధార పోశెట్టి, శేఖర్ గౌడ్, ఓండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.