నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని అంబం ఆర్ గ్రామంలో బుడిగెల లక్ష్మి అనే మహిళకు చెందిన ఆవు తోకను గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తిరించి పక్కనే పడేసినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకోగా ఆవు పడుతున్న మౌన రోధన చూసి కొందరు కన్నీటి పర్యంతమవుతున్నారు.