తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ బాన్సువాడ, నసురుల్లాబాద్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం ఉదయం టిఫిన్ జీరా రైస్, రాగి జావను పరిశీలించి, నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న అన్ని రకాలుగా విద్యార్థి సంఘం నాయకులుగా మేము మీ వెంటే ఉంటామన్నారు.