కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఎస్ పి సింధు శర్మ

51చూసినవారు
కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఎస్ పి సింధు శర్మ
ఎస్పీ సింధు శర్మా ఐ. పి. ఎస్ బాన్సువాడ టౌన్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ను గురువారం సందర్శించడం జరిగింది. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు, పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్