

PM మోడీ రాజీనామా చేయాలి: కేఏ పాల్ (వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం పాల్ మీడియాతో మాట్లాడారు. ‘భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరితో పెట్టుకున్నా ట్రంప్ భారతీయులతో పెట్టుకోవద్దు’ అని అన్నారు. భారత్ పౌరులకు ట్రంప్ బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీకి చేతకాకపోతే రాజీనామా చేసి అమిత్ షాని ప్రధాని చేయాలన్నారు. భారత్ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.