బాన్సువాడ పట్టణానికి చెందిన మేకల సాయిలు, మల్లూరు సాయిలును మంగళవారం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చలో అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.