రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో వచ్చే సంవత్సరానికి గాను 6వ తరగతిలో 40 ఖాళీలకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి బి. శ్యామల మంగళవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందుకు గాను కావలసిన ధ్రువపత్రాలలో పూర్వం చదివిన పాఠశాల బోనఫైడ్ తో పాటు ఇతర విద్యా సంబంధ ధ్రువ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, నాలుగు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, జనన ధ్రువీకరణ పత్రము, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రముతో పాటు ఆరోగ్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.