రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన రెండు కుటుంబాల బాధితులకు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు ఆదివారం ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అత్కూరి మహేష్, బట్టు నాగయ్య, శానం గంగారాం, కుర్మ బాలయ్య, ఒడ్డె సాయిలు, తదితరులు పాల్గొన్నారు.