రుద్రూర్ నుంచి బొప్పాపూర్ వెళ్లే దారిలో వాగు వద్ద అక్రమంగా మొరం మట్టి త్రవ్వకాలతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ దారి గుండా వాహనాలలో పలు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ వాగు ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రోడ్డు శిథిలమై గుంతలు పడడంతో వాహనదారులు ఇక్కడికి రాగానే కుదుపులకు గురై ఆ గుంతలలో పడిపోయే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ఇలా అనుమతులు లేకుండా అక్రమంగా గుంతలు తీసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.