రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ఎస్సై సాయన్న శనివారం అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో ట్రాఫిక్ రూల్స్ పై పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుందని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.