రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున భక్తులు ఆలయానికి చేరుకొని అభిషేకాలు, విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణము, తులసి అర్చన నిర్వహించారు. ఆలయ పూజారి రామశర్మ తొలి ఏకాదశి ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.