కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కొనా బాన్సువాడ లో సోమవారం ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.