కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo గ్రామంలో సోమవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో గల సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, పూర్వ విద్యార్థుల కమిటీ ఉపాధ్యక్షులు కాపర్తి శివరాజులు పాల్గొన్నారు.