సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 200 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. భావితరాల రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకునే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.