బాన్సువాడ పట్టణంలోని ఒకటోవార్డు పరిధిలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న డిజిటల్ సర్వేను శనివారం సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి సర్వే చేపడుతున్నప్పుడు అధికారులు కుటుంబ సభ్యుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మల్లికార్జున్ రెడ్డి, తులా శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అంజు పాల్గొన్నారు.