బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో శనివారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిoచారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ దగ్గు, దమ్ము ఉన్న రోగులకు 102 వాహనంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ANM, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.