బాన్సువాడ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి టిఎస్పి భార్గవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు సత్యనారాయణ గౌడ్, కృష్ణ, ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి, ఎస్సై తేజస్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, భూషణ్ రెడ్డి, రమాకాంత్, మోహన్ రెడ్డి, ఖలీల్, సిబ్బంది సాయిబాబా, రాకేష్, శ్యాంసుందర్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.