బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఆన్ లైన్ డేటా ఎంట్రీ నమోదును మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ శనివారం పరిశీలించారు. నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నార్ల ఉదయ్, యండి దావూద్, మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.