కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో జడ్జి టిఎస్పి భార్గవి అధ్యక్షతన శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ను కక్షి దారులు ఉపయోగించుకొని కేసులు పరిష్కరించుకోవాలని.. రాజీమార్గమే రాజమార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, AGP లక్ష్మి నారాయణ మూర్తి, అడ్వకేట్ లు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.