కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో ఎటు చూసినా చెత్తతో నిండిపోయిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోడ్లు చెత్తతో నిండిపోవడంతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారని గ్రామస్తులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలోని చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.