బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా గ్రామ పంచాయతీలో ప్రదర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ శనివారం తెలిపారు. ఈ జాబితాలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేడు గ్రామపంచాయతీలో లిఖితపూర్వకంగా తెలుపవలసిందిగా ఆయన కోరారు. అభ్యంతరాల స్వీకరణకు నేడే చివరి తేధీ అని ఆయన పేర్కొన్నారు.