బాన్సువాడ మండలంలో బోర్లంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం డివిజన్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నల్లోళ్ల సాయిలు, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి మన్నె అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సంఘ సభ్యులు దిలీప్, జగ్గా ఆనంద్, రాజ్ కుమార్, సంతోష్, మోహన్, రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.