కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను పురోహితులు బస్వరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శంకర్, గురు వినయ్, దామరంచ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.