డిగ్రీ కళాశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్

59చూసినవారు
డిగ్రీ కళాశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్
బాన్సువాడ మండలంలోని ప్రభుత్వడిగ్రీ కళాశాలను జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ సింగ్ గురువారం సందర్శించి కళాశాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల అడ్మిషన్ సరళిని విద్యార్థుల హాజరు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలను ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన కళాశాల ప్రిన్సిపల్ ఇందూరు గంగాధర్ ను అభినందనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.