కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం అంజని తండాలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వాణి టీచర్‌ను గ్రామస్తులు సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పండరి మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే యొక్క సేవలు, విద్యారంగానికి చేసిన త్యాగాలు గుర్తు చేసారు.