ఎల్లారెడ్డి: మైనారిటీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి

70చూసినవారు
ఎల్లారెడ్డి: మైనారిటీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి
ఎల్లారెడ్డిలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కృషి ఎనలేనిదని ఉపాధ్యాయులు అన్నారు. ఆయన జీవిత విశేషాలను, ఎదుర్కొన్న కష్టాలను, జాతికి అందించిన సేవలను విద్యార్థులకు తెలియ పరిచారు.

సంబంధిత పోస్ట్