కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామ పరిధిలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రంలో ఎగ్ బిర్యాని వడ్డించి పిల్లలకు ఆనందంగా తినిపించారు. 5 సం. నిండిన ప్రతి ఒక్క పిల్లలు అంగన్వాడి కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని అంగన్వాడి టీచర్ నర్సవ్వ కోరారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సి. ఏ. లు రవి, సాయిలు అంగన్వాడి ఆశ వర్కర్లు, బాలింతలు, తల్లులు, పిల్లలు ఇతరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.