బాన్సువాడ: విద్యార్థిని సన్మానించిన సామాజిక ఆశయ సాధన సేవా సంఘం

85చూసినవారు
బాన్సువాడ: విద్యార్థిని సన్మానించిన సామాజిక ఆశయ సాధన సేవా సంఘం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గైని రవి కుమార్తె ఇందు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 957 ఉత్తమ మార్కులు సాధించిoది. ఈ సందర్భంగా శుక్రవారం సామాజిక ఆశయ సాధన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సందుల గంగారం విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్