భూపాలపల్లి: సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దళిత ఎంపీకి అవమానం

69చూసినవారు
భూపాలపల్లి: సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దళిత ఎంపీకి అవమానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 15న ప్రారంభమైన కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లెక్సిలలో స్థానిక ఎంపీ గడ్డం వంశీ ఫోటో వేయక పోవడం, అలాగే కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ మాలల ఐక్య వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాల శనివారం పేర్కొన్నారు. గతంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై కూడా ఆయన పేరు ఏర్పాటు చేయలేదని కేవలం గడ్డం వంశీ గారు దళితుడు అయినందునే ఈ వివక్ష చూపుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.

సంబంధిత పోస్ట్