బిచ్కుంద మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. బీజేపీ బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే కుమారి అరుణతార, స్టేట్ ఎస్సీ కౌన్సిలర్ మెంబర్ గంగారం, బీజేపీ సీనియర్ నాయకులు శివాజీ పటేల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.