బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో అంగన్ వాడి ప్రారంభం మొదటి రోజున ప్రతీ ఒక్క విద్యార్థికి పుస్తకాలు, వారికి కావలసిన పరికరాలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ పటేల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మీ, గ్రామ దేవాలయ కమిటీ అధ్యక్షులు శంకర్రావు పటేల్, ఉపాధ్యక్షులు కూర్మ నాగ్ నాథ్, రేషన్ డీలర్ కుర్కుటే హన్మంతు, ముదిరాజ్ హన్మండ్లు పాల్గొన్నారు.