కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం నుండి కందర్ పల్లి రోడ్డు పరిస్థితి ప్రమాదంగా తయారైంది. ఎటు చూసినా రాళ్లు, రప్పలతో, ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఇలాంటి ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు బయపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రోడ్డును బాగు చెయ్యాలని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.