టీచర్ కుర్చీ కింద బాంబ్ పెట్టి పేల్చిన విద్యార్థులు
యూట్యూబ్లో చూసి బాణసంచా తరహా బాంబును 12వ తరగతి విద్యార్థులు తయారు చేసి.. దాన్ని టీచర్ కుర్చీ కింద పెట్టి పేల్చారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. అయితే టీచర్ మందలించడంతో ఎదురుదాడి చేయాలని విద్యార్థులు ప్లాన్ చేశారని ఓ మీడియా సంస్థ తెలిపింది. టీచర్ కుర్చీ కింద బాంబును ఒక విద్యార్థి ఉంచగా, మరొకరు రిమోట్ తో పేల్చారు. దీనిపై స్పందించిన హరియాణా విద్యాశాఖ..13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.