అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వద్దు: పిట్లం ఏఎస్ఐ

80చూసినవారు
అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వద్దు: పిట్లం ఏఎస్ఐ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి గ్రామంలో సోమవారం గ్రామ రైతులకు సైబర్ నేరాలపై పిట్లం పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిట్లం ఏఎస్ఐ లింబాద్రి మాట్లాడుతూ.. ఎవరైనా గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులు ఓటిపి చెప్పాలని అడిగితే చెప్పొద్దని, ద్విచక్ర వాహనలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్