పిట్లం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి హరికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి చికిత్సలు చేసిన అనంతరం అవసరమైన వారికి అద్దాలను సిఫారసు చేసి మందులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.