పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం (హైదరాబాద్) సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేపించుకున్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలను, మందులను సుశీల నేత్రాలయ వైద్య సిబ్బంది అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.