రాంపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

84చూసినవారు
రాంపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపీడీవో కమలాకర్, ఎంపీఓ నాగరాజు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్, మాజీ ఎంపీటీసీ సునీత బలరామిరెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్