కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సోమవారం జై మళ్లర్ అహిల్యాబాయ్ హోల్కర్ కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజా చేసారు. హట్కర్ సమాజ్ నాయకులు మాట్లాడుతూ త్వరలోనే జుక్కల్ మండల కేంద్రంలోని అహిల్యాబాయ్ హోల్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిలు పాటిల్, మాజీ ఎంపీపీ సతీష్ పాటిల్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గంగు నాయక్, రామారావు నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.