
ఏపీలో భారీ లిక్కర్ స్కామ్.. కీలక సూత్రధారి ఆయనే: విజయసాయిరెడ్డి
AP: తాను ప్రలోభాలకు లొంగిపోయానని తమ నాయకుడు అన్నారని.. కానీ తాను లొంగలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి పీఎస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మీ మనసులో నాకు స్థానం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని జగన్‌కి చెప్పా. లిక్కర్ స్కామ్‌కి కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అలాగే జగన్‌కు ఈ కేసులో సంబంధం లేదన్నారు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేది.. ఇప్పుడు దేవుడిపైనే ఉంది." అని పేర్కొన్నారు.