అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం మండల కేంద్రంలో ఆ మహానీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ ప్రజలకు అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు.