కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కే అశోక్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు తమ నూతనమైన ఆలోచనా విధానాన్ని, నూతన వ్యాపారాలపై ముందుకు రావాలని తెలియజేశారు.