కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో దొంగ చాటుగా ఇసుక మాఫియా జోరుగా సాగుతుంది. హస్గుల్ నుండి ఇతర ప్రాంతాలకు ఇసుక సరఫరా చేయడం జరుగుతోంది. ముందు ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి పక్కనున్న పరిస్థితులను చూసి, పసిగట్టి ఫోన్లు చేసి ఇసుక మాఫియా దందాను చలామని చేస్తున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామస్థాయి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.