తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి భూ హక్కుల ఆర్ఓఆర్ చట్టం రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారం కోసమేనని మద్నూర్ మండల డిప్యూటీ తహసిల్దార్ శివరామకృష్ణ ఆర్ ఐ శంకర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం నాడు మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామంలో రెవిన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు.