జుక్కల్ సెగ్మెంట్ బిచ్కుంద మండలం గోపన్ పల్లి శివారులో అక్రమ ఇసుక డంప్ లపై గురువారం తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి సీజ్ చేసినట్లు తహసీల్దార్ సురేష్ తెలిపారు. ఈ సందర్బంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక డంప్ చేసిన రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన ఇసుక డంపులను శుక్రవారం వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.