పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్ లో శుక్రవారం ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. 8 మంది విద్యార్థులకు ఫీజియో థెరపీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల ఎంఈఓ దేవి సింగ్, ఉపాధ్యాయులు కమల, కిషోర్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.