పిట్లం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ ప్రెసిడెంట్ కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సమితి జుక్కల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ప్రెసిడెంట్ గా అశోక్ రాజ్ ను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అశోక్ రాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్ అధ్యక్షుడు కుమ్మరి యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.