జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువుల కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమకారణీ అని కొనియాడారు.